3 ఏళ్ళ చిన్నారికి సోకిన కరోనా వైరస్
- March 09, 2020
ఇటలీ నుంచి వచ్చిన మూడేళ్ళ చిన్నారికి కరోనా వైరస్ సోకింది. ఇటలీ నుంచి కోచికి దుబాయ్ మీదుగా ఆ కుటుంబం ప్రయాణించినట్లు తెలుస్తోంది. మార్చి 7న కోచిలో ఈ కుటుంబానికి స్క్రీనింగ్ చేశారు. కరోనా గుర్తించగానే, ఐసోలేషన్ వార్డ్‌కి తరలించారు. ఎర్నాకులం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చిన్నారికి వైద్య చికిత్స అందుతోంది. కేరళలో ఇది ఆరవ కరోనా వైరస్ కేసు కావడం గమనార్హం. అయితే, చిన్నారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించినా, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. ఈ కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణించినవారు, వారితో కలిసినవారు ఐసోలేషన్‌లో వుండాలనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







