సౌదీ లేబర్‌ మార్కెట్‌లో 35 శాతం మహిళలు

- March 09, 2020 , by Maagulf
సౌదీ లేబర్‌ మార్కెట్‌లో 35 శాతం మహిళలు

రియాద్‌:జనరల్‌ అథారిటీ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ (జిఎఎస్‌టిఎటి), అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సౌదీ విమెన్‌ - పార్టనర్స్‌ ఇన్‌ సక్సెస్‌’ పేరుతో ఓ ప్రేత్యక రిపోర్ట్‌ని విడుదల చేసింది. నేషనల్‌ డెవలప్‌మెంట్‌కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ మహిళల పాత్రను తెలియజేసేలా ఈ రిపోర్ట్‌ని తీర్చిదిద్దారు. జిఎఎస్‌టిఎటి 11 విభాగాల్లో సర్వే నిర్వహించింది. ఆ వివరాల్ని వెల్లడించడం జరిగింది. 2020 జనవరి నాటికి 174,624 డ్రైవింగ్‌ లైసెన్సుల్ని మహిళలకు జారీ చేశారు. 15 ఏళ్ళు పైబడిన మహిళల సంఖ్య 49 శాతం. మహిళల సగటు వయసు 28 కాగా, సౌదీ మహిళలో సగం మంది 27 సంవత్సరాల లోబడిన వాళ్ళే. లేబర్‌ మార్కెట్‌లో సౌదీ ఫిమేల్‌ వర్కర్స్‌ శాతం 35గా వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com