ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదిక వద్ద బాంబు పేలుళ్ళు
- March 09, 2020
కాబుల్:ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) బాంబులతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబుల్‌లో (Kabul) అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Mohammad Ashraf Ghani) ప్రమాణ స్వీకార సమయంలో తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దాడితో ప్రమాణస్వీకారానికి వచ్చిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.
అయితే ఇది ఉగ్రవాద చర్య అవునా? కాదా? అనేది నిర్థారణ కాలేదు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం తదితర ఇంకా అధికారిక సమాచారం లేదు. కాగా అష్రఫ్ ఘనీ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. పేలుళ్ళు సంభవించిన తర్వాత అష్రఫ్ ఘనీ మాట్లాడుతూ, ‘‘నేను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించలేదు, కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నాను. నా తలను త్యాగం చేయవలసి ఉన్నా నేను ఇక్కడే ఉంటాను’’ అని పేర్కొన్నారు.అంతకుముందు ప్రత్యర్థులైన ఆఫ్ఘనిస్థాన్ నేతలు అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా వేర్వేరుగా ఆ దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు కార్యక్రమాలను వందలాది మంది వీక్షించారు. అదే సమయంలో అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకార వేదిక వద్ద బాంబు పేలుళ్ళు, తూటాల పేలుళ్ళు సంభవించాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







