కరోనా ఎఫెక్ట్..ప్రధాని పర్యటన రద్దు
- March 10, 2020
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కొవిడ్-19) పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యలో ప్రధాని మోడి బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న మోడి బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండోఈయూ సదస్సుకు కూడా మోడి హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







