సౌదీ నుంచి వస్తూ ఒమాన్ లో చిక్కుకున్న తెలుగోళ్లు
- March 10, 2020
అనంతపురం జిల్లా కదిరి, చిత్తూరు జిల్లా కురబలకోట, అంగళ్లు, మదనపల్లె తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది వరకు ముస్లింలు పవిత్ర మక్కా సందర్శనార్థం గత నెల 24న బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సోమవారం ఉదయం జెద్దాలోని కింగ్ ఖలీద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులోని ఓ ఇద్దరు ఇతర ప్రయాణికులకు జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు జరిపి.. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో ఒమన్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







