కేంద్రం కానుక

- January 23, 2016 , by Maagulf
కేంద్రం కానుక

తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి.. జాతీయ పెట్టుబడులు, మాన్యుఫాక్చరింగ్‌ జోన్ల కింద కేంద్రం నాలుగు పారిశ్రామిక వాడలకు కేంద్రం అనుమతులు మంజూరుచేసింది.. మెదక్ జిల్లాలో 60వేల కోట్ల టర్నోవర్‌తో... 2లక్షల 61వేలమందికి ఉపాది కల్పించే లక్ష్యంతో.. ఈ పారిశ్రామిక వాడ నిర్మించబోతున్నారు.. ఇందులో పలు కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాయి.. పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్‌ పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సరిహద్దుల్లో ఫార్మా వాడను నెలకొల్పేందుకు కేంద్రం అనుమతులిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో 2.25 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పసుపు బోర్డు , స్పైసెస్ బోర్డు , పార్క్ ఏర్పాటుపై కేంద్రానికి లేఖ పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు, పార్క్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పనుపు బోర్టు ఏర్పాటును సానుకూలంగా స్పందించిన కేంద్రం స్పైసెస్ పార్క్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఇతర పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సెజ్ ల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇప్పుడు మరో నాలుగు పారిశ్రామిక వాడలకు అనుమతులు లభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com