ఇండియన్ స్కూల్ ఉద్యోగులకు పెన్షన్
- March 10, 2020
మస్కట్: ఇండియన్ స్కూల్స్ - ఒమన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, భారత ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)ని ఇండియన్ స్కూల్ ఎంప్లాయీస్‌కి వర్తింపజేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఇండియన్ స్కూల్స్ స్టాఫ్ ఎన్‌పిఎస్ స్కీమ్ కిందకి వస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అసోసియేషన్‌తో ఈ ఎన్‌పిఎస్‌ని అమలు చేస్తారు. ఉద్యోగుల లాంగ్ టెర్మ్ వెల్ఫేర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ స్కూల్స్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వెల్లడించారు. ఇండియన్ స్కూల్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్యూల్, బ్యాంక్ ఆఫ్ బరోడా జిసిసి ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డి ఆనంద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ బోర్డ్ ఫైనాన్స్ డైరెక్టర్ భవానీ ప్రసాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒమన్ ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విపిన్ కుమార్ గార్గ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







