రాజ్ కందుకూరి చేతుల మీదుగా `1992` మూవీ పోస్టర్ - ఫస్ట్ సింగిల్ లాంచ్
- March 10, 2020
పివియమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `1992`. ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ సింగిల్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``1992`టైటిల్ మరియు ఫస్ట్ సింగిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనుప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా``అన్నారు.
దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేనెంతో ఇష్టపడే నిర్మాత రాజ్ కందుకూరి గారు మా సినిమా లోగో, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం మూవీ లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం``అన్నారు.
నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ...‘‘యాత్ర `సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా నటిస్తున్నా. ఒక ఇన్నోసెంట్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఫస్ట్ సాంగ్ రాజ్ కందుకూరి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంద``న్నారు.
హీరో, నిర్మాత మహి రాథోడ్ మాట్లాడుతూ...‘‘రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా నా ఫస్ట్ సినిమా సాంగ్, టైటిల్ లోగో లాంచ్ చేయడం అదృష్టం గా భావిస్తున్నా. డైరెక్టర్ శివ గారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
హీరోయిన్ మోనా ఠాగూర్ మాట్లాడుతూ...``తెలుగులో నా ఫస్ట్ ఫిలిం ఇది. నా క్యారక్టర్ చాలా ట్రెండీగా, డిఫరెంట్ గా ఉంటుంది’’ అన్నారు.
మహి రాథోడ్, మోనా ఠాగూర్ , దిల్ రమేష్, జబర్దస్త్ రాజశేఖర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాత: మహి రాథోడ్, రచన`దర్శకత్వం: శివ పాలమూరి.
తాజా వార్తలు
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC