కరోనా అలర్ట్:పవిత్ర మక్కా మసీదులో టచ్ స్క్రీన్ సేవల నిలిపివేత

- March 11, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:పవిత్ర మక్కా మసీదులో టచ్ స్క్రీన్ సేవల నిలిపివేత

సౌదీ అరేబియా:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు పవిత్ర మక్కా మసీదు, మదీనా మసీదులో ప్రార్ధనలకు వచ్చే భక్తులకు వైరస్ సోకకుండా ప్రార్ధన మందిరాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే జనరల్ ప్రెసిడెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మక్కా మసీదులో ఏర్పాటు చేసిన ఇంటరాక్టీక్ ఎడ్యూకేషన్ టచ్ స్క్రీన్ సేవలను కూడా నిలిపివేసింది. టచ్ స్క్రీన్ ను ముట్టుకోవటం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు. అయితే..రిమోట్ కంట్రోల్ ఆపరేట్ ద్వారా కొంత మేర డిజిటల్ కంటెంట్ చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే ప్రెసిడెన్సీస్ పోర్టల్స్, ఫిక్స్ డ్ డిస్ ప్లేల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని డైరెక్టర్ వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com