కువైట్: వైరస్ అటాక్ అయినా సీక్రసీ మెయిన్టేన్ చేస్తే ఫైన్..ఎంపీల సూచన
- March 11, 2020
కువైట్:కరోనా వైరస్ అటాక్ అయినా..ఎవరికి చెప్పకుండా సీక్రసీ మెయిన్టేన్ చేసే వారిపట్ల కొంత కఠినంగా ఉండాలని కువైట్ ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో ఇతర డిసిసెస్ ను దాటిపెడితే వారికి ఫైన్ విధించాలని ఎంపీలు సూచించారు. ఈ మేరకు హెల్త్ యాక్ట్ లో తగిన సవరణలు చేపట్టాలని కూడా తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖలెద్ అల్ హమద్ అల్ సబా ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై పోరాటానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు డిసీస్ వచ్చినట్లు తెలిసినా దాన్ని దాచే ప్రయత్నం చేసే వారికి ఫైన్ విధించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా జనం వైరస్ సోకగానే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే దిశగా ఫలితాలు సాధించొచ్చని సజిషన్ చేశారు. సమావేశం వివరాలను వెల్లడించిన స్పీకర్..కువైట్ లోని అన్ని స్టేట్ ఎజెన్సీలు కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమియిస్తున్నాయని వెల్లడించారు. సమిష్టి చర్యలు, తక్షణ నిర్ణయాలతో కరోనా వైరస్ పై కువైట్ ప్రజలు విజయం సాధిస్తారని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..