కరోనా ఎఫెక్ట్.. 83 ట్రైలర్ రిలీజ్ వాయిదా!
- March 11, 2020
కపీల్ సేన వరల్డ్ కప్ ని ఎలా సాధించింది ? 1983 వరల్డ్ కప్ లో వారిపోరాటం ఎలా సాగింది ?? చూపించబోతున్నాడు దర్శకుడు. కబీర్ సింగ్. '83' పేరిట తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ బీర్ సింగ్ నటిస్తున్నారు. ఆయనకి జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారు.
సునీల్ గవాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తాహీర్ రాజ్ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్‌గా అమ్మీ విర్క్ కనిపించబోతున్నారు. ఏప్రిల్ 10న 83ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన చిత్రబృందం.. త్వరలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జరపాలని భావించింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈవెంట్‌ని రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఇక దేశంలో కారనా బారిన పడిన వారి సంఖ్య 50దాటింది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా రిలీజ్ డేట్స్, సినిమా షూటింగ్స్ రద్దవుతున్నాయి. సినీ రంగంతో పాటు అన్నీ రంగాలని కరోనా ప్రభావితం చేస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







