దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...మృతిచెందిన తెలంగాణకు చెందిన కార్మికుడు
- March 11, 2020
దుబాయ్: జగిత్యాల జిల్లా, కతలాపూర్ మండలం, అంబారిపేట్ గ్రామానికి చెందిన కొత్తపెల్లి అజయ్ కుమార్ (23) అనే యువకుడు గత గురువారం రోజున తన స్నేహితుని దగ్గరికి వెళ్లి శుక్రవారం నాడు సాయంత్రం తన రూముకి తిరిగివస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో అనుకోకుండా కారు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
సమాచారాన్ని మృతుని యొక్క తోటి కార్మికులు మరియు భందువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ కి తెలపడంతో వెంటనే స్పందించి అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి కంపెనీ పూర్తి సహకారంతో మృతదేహాన్ని ఈ రోజు ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.
"గల్ఫ్ అన్నలు దయచేసి రోడ్డు దాటుతున్న సమయంలో మరియు వాహనాలు నడుపుతున్న సమయాలల్లో చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించాల్సిందిగా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన T NRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి వేడుకుంటున్నాము." అని గుండెల్లి నరసింహ కోరారు.
మృతి చెందిన అజయ్ కుమార్ ను స్వగ్రామం చేర్చేందుకు సహకరించినవారు: గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, విజయ్ కొత్తపల్లి, ఉప్పులుటి శ్రీనివాస్, ధూంపెట రవీందర్, మామిడిపల్లి నారాయణ, శనిగరపు భూమేష్ మధు, CH నాగరాజు,కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, పేంట రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి తదితరులు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు