కరోనా ఎఫెక్ట్:ఇండియాకు ప్రయాణాన్ని ఎవైడ్ చేయండి..యూఏఈ ఎంబసీ అడ్వైజ్
- March 12, 2020
యూఏఈ పౌరులు ఎవరు భారత్ కు వెళ్లవద్దని ఆ దేశ ఎంబసీ సూచించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించటంతో భారత్ లోని యూఏఈ ఎంబసీ ఈ ప్రకటన చేసింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని దేశాల నుంచి టూరిస్టు వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 12 అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 15 వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుందని భారత ప్రభుత్వం తెలిపింది. ఓసీఐ కార్డ్ హోల్డర్లకు ఉన్న వీసా ఫ్రీ నిబంధన సహా, అధికారిక వీసాలు, డొప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు, ఉద్యోగ, ప్రాజెక్టులకు సంబంధించిన వీసాలు మినహా ఇతర వీసాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశాల నుంచి వస్తున్న వారందరూ తప్పనిసరిగా 14 రోజుల ఐసోలేషన్ ఉండాలని సూచించింది. ముఖ్యంగా చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి ఫిబ్రవరి 15, ఆ తర్వాత వచ్చిన ప్రయాణికులందరిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న యూఏఈ పౌరులు త్వజుదీ సర్వీస్ లో రిజిస్టర్ చేసుకోవాలని ఎంబసీ అధికారులు కోరారు. అలాగే +91 81819 11111 నెంబర్ కు కాంటాక్ట్ కావొచ్చని పేర్కొన్నారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు