దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు
- March 12, 2020
గతంలో పలు చిత్రాలు చేసిన దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) తాజాగా రూపొందించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. టైటిల్ పాత్రలలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా...ప్రముఖ నటి జమున ఓ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెన్నార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ పట్ల తనకు గల అభిమానాన్నిదర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు చాటుకుంటూ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు పోస్టర్స్ ను తిలకించిన కె.విశ్వనాద్ ఆ చిత్ర విశేషాలను శివనాగును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అందరికీ సుపరిచితమైన పలువురు ప్రముఖ ఆర్టిస్టులు నటించిన....పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం విజయవంతం కావాలని కె. విశ్వనాద్ ఆకాంక్షించారు. ఇంకా షూటింగ్ చేసిన లొకేషన్స్ ను వాకబు చేసిన ఆయన అమరావతి పరిసర ప్రాంతాలలో తీశామని చెప్పగానే... ఒకప్పుడు తాను రూపొందించిన సప్తపది చిత్రాన్ని అదే సమయంలో గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...