కెనడా ప్రధాని భార్యకి కరోనా
- March 13, 2020
కెనడా:కరోనా మహమ్మారి దేశాధినేతల్ని సైతం వణికిస్తోంది. తాజాగా కెనడ ప్రధాని జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరికీ కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గురువారమే ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో.. ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండటంతో.. ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు.
సోఫీ ఇటీవలే బ్రిటన్‌లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో తెలిపారు. లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. ట్రూడో మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజుల్లో సోఫీని కలిసిన వారందరిని గుర్తించి పరీక్షించనున్నట్లు కామెరూన్ తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు 14 రోజుల పాటు ప్రధాని ట్రూడో ఇంటికే పరిమితమవుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం కెనాడలో 138 మందికి కరోనా వైరస్ సోకింది
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..