మస్కట్:నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు..వాహనదారులు జాగ్రత్త!
- March 14, 2020
మస్కట్:బలమైన గాలులు వీస్తుండటంతో నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. దీంతో అటు వెళ్లే వాహనదారులంతా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. ఇసుక మేటల కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఆన్ లైన్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ గబా నుండి హైమా వరకు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, దాని కారణంగా రోడ్డుపై భారీగా ఇసుక పేరుకుపోయిందని వివరించారు. నిజ్వా-సలాహ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తమ ప్రకటనలో తెలిపారు. అలాగే ROP వాహనదారుల సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటుందని అన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







