ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు

- March 15, 2020 , by Maagulf
ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు

కువైట్:కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రవాసీయులకు హెల్త్ చెకప్ ప్రొగ్రాంను మార్చి 15 వరకు పొడగించినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు అనౌన్స్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తప్పనిసరిగా మార్చి 15లోపు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. మార్చి 1 తర్వాత ఈజిప్ట్, సిరియా, లెబనాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రవాసీయులు మిస్ కాకుండా హెల్త్ చెకప్ ప్రొగ్రాంలో పాల్గొనాలన్నారు. మిష్రఫ్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ లో శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని వివరించారు. అయితే..చెకప్ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు.


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com