బహ్రెయిన్: అల్ సలమ్ ఇన్షియేటీవ్ పేరుతో కస్టమర్లకు అల్ సలమ్ బ్యాంక్ ఆఫర్
- March 15, 2020బ్యాంక్ కస్టమర్లకు, కార్పోరేట్ సెక్టార్ కు కొద్ది మేర బెనిఫిట్ చేకూర్చేలా అల్ సలమ్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. అల్ సలమ్ ఇన్షియేటీవ్ పేరుతో అఫర్స్ ప్యాకేజీని విడుదల చేసింది. దీని ద్వారా బ్యాంక్ కస్టమర్లు, కార్పోరేట్ వర్గాలు ప్రాఫిట్ ఫ్రీ లోన్స్, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకునే అఫర్స్ పొందవచ్చు. అల్ సలమ్ ఇన్షియేటీవ్ ద్వారా సులభంగా లోన్లు పొందవచ్చని, అలాగే ప్రాసెస్ ఫీజు ఇతర ఛార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చని బ్యాంక్ సీఈవో రఫిక్ నయద్ తెలిపారు. బ్యాక్స్ కార్పోరేట్, ఎస్ఎమ్ఈ, రిటైల్ కస్టమర్స్ మంచి ప్రయోజనం పొందవచ్చని ఆయన అన్నారు. సమాజ పురోగతి కోసం టీమ్ బహ్రెయిన్ మెంబర్ గా అల్ సలమ్ బ్యాంకు భాగస్వామ్యం అవుతోందని, అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని రఫీక్ వెల్లడించారు. అల్ సలమ్ ఇన్ఫియేటీవ్ ప్యాకేజీ ద్వారా రిటైల్ కస్టమర్లు BD500 వరకు ప్రాఫిట్ ఫ్రీ లోన్లు పొందే అవకాశం ఉంది. అయితే..నిర్ణీత కాలవ్యవధిలోనే తిరిగి పే చేయాలి. రమదాన్ తర్వాత తొలి రీపేమెంట్ ఇన్స్ స్టాల్మెంట్ పే చేయాల్సి ఉంటుంది. లోన్ ప్రాసెస్ తొందరగా సులభంగా పూర్తి చేసేందుకు ఆన్ లైన్ లోనూ అప్లై చేసుకోవచ్చని రఫిక్ వెల్లడించారు. లోన్స్ పొందిన వారు డబ్బుతో పాటు అటోమేటిక్ గా క్రెడిట్ కార్డు లిమిట్ 10 శాతం పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత