కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి సౌదీకి వచ్చే కరెన్సీకి కూడా ఐసోలేషన్

- March 15, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి సౌదీకి వచ్చే కరెన్సీకి కూడా ఐసోలేషన్

కరోనా వైరస్ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ మార్గం ద్వారా అయినా విదేశాల నుంచి సౌదీలోకి ప్రవేశించే కరెన్సీని కూడా ఐసోలేట్ చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి విదేశాల్లోని సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ -SAMA బ్రాంచెస్ నుంచి గానీ మనీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీస్ ద్వారా దేశంలోకి ట్రాన్స్ ఫర్ అయ్యే కరెన్సీ కూడా ఐసోలేట్ అయ్యాకే దేశంలోకి విడుదల చేస్తారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి కారణం అయ్యే అవకాశాలు ఉండటంతో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్లు, కాయిన్స్ మాత్రమే కాదు..ప్రతీ రోజు వాడే సామాగ్రిని కూడా శానిటైజ్ చేస్తున్నారు. డోర్ హ్యాండిల్స్, ట్రాలీస్, మార్కెట్లు, ఎయిర్ పోర్టులలో కొనుగోలు చేసిన వస్తువులు, ఇతర ప్రాంతాల్లోని సర్ ఫెస్ కూడా వైరస్ వ్యాప్తి చెందే కారకాలుగా మారే అవకాశాలు ఉన్నాయన్నది అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయా వస్తువులను కూడా శానిటైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com