కరోనా వ్యాక్సిన్ కోసం ట్రంప్ కుట్ర పన్నుతున్నారా?!
- March 16, 2020
కరోనా వైరస్..ఇప్పుడు చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించి కబళిస్తోంది. చాలా దేశాల్లో మరణమృదంగం వాయిస్తోంది. ఇటలీ, ఇరాన్ దేశాల్లో వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. భారత్ లోనూ వేగంగా విస్తరిస్తోంది.
ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. అయితే ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా జర్మనీకి చెందిన క్యూర్ వాక్ అనే ఔషధ పరిశోధన సంస్థ కరోనా వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ పరిశోధనల్లో పురోగతి సాధించింది. అమెరికా ఈ సంస్థకు భారీగా డబ్బులు ఆశపెట్టినట్టు ప్రముఖ జర్మనీ పత్రిక వెలువరించిన కథనం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమైంది. ఈ వ్యాక్సిన్ కేవలం అమెరికా ప్రజలకు మాత్రమే వినియోగించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్టు మీడియా కథనంలో పేర్కొంది.
ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో క్యూర్ వ్యాక్ సీఈవో భేటీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీంతో ఈ వ్యాక్సిన్ ట్రంప్ చేతుల్లోకి వెళ్లకుండా జర్మనీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు