చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. నిర్భయ దోషుల కుటుంబీకులు

- March 16, 2020 , by Maagulf
చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. నిర్భయ దోషుల కుటుంబీకులు

 

ఢిల్లీ: నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని వారు ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. నిర్భయ నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు అందరూ కలిసి ఈ రాష్ట్రపతికి ఈ లేఖ రాశారు. కారుణ్య మరణం ప్రసాదించేందుకు రాష్ట్రపతిని, నిర్భయ తల్లిదండ్రులను కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు 13 మంది లేఖలో సంతకం చేశారు. ఇక 13 మందిలో ఇద్దరు ముఖేష్‌ కుటుంబానికి చెందిన వారు కాగా, నలుగురు పవన్‌, వినయ్‌ కుటుంబానికి చెందిన వారు, అక్షయ్‌ కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు.
 
నిర్భయ దోషులకు నాలుగో సారి డెత్‌ వారెంట్‌ జారీ అయింది. ఈనెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ పటియాల హైస్‌ కోర్టు తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు.. దోషుల వివిధ రకాల పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగో సారి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. మరి ఇప్పుడైనా ఉరి అమలు అవుతుందా..? లేదా? అనేది వేచి చూడాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com