రియాద్:విజిట్ వీసా గడువు పెంపు..సౌదీలో చిక్కకుపోయిన యాత్రికులకు ఊరట
- March 17, 2020
రియాద్:ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను రద్దు చేసిన నేపథ్యంలో సౌదీలోని విజిటర్లకు విజిట్ వీసా గడువును పెంచాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిటర్లు ఈ-ప్లాట్ ఫాం అబ్షెర్ ద్వారా అప్లై చేసి వీసా గడువును పెంచుకోవచ్చు. ఒక వేళ ఆన్ లైన్ లో కుదరకపోతే పాస్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుకు వెళ్లి విజిట్ వీసా గడువును పెంచుకోవచ్చని విజిటర్లకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ ఫ్లైట్లను రెండు వారాల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే సౌదీ పర్యటనలో ఉన్న విదేశీయులు దేశంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే విదేశీయుల విజిట్ విసా గడువును పెంచారు. ఇదిలాఉంటే సౌదీ అరేబియాలో నిన్న ఒక్క రోజే కొత్తగా 15 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య 118కి పెరిగింది. ఇందులో ముగ్గురు రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?