కరోనా అలర్ట్ : ఆరోగ్య సంరక్షణ చర్యలకు భంగం కలిగిస్తే జైలుశిక్ష..

- March 17, 2020 , by Maagulf
కరోనా అలర్ట్ : ఆరోగ్య సంరక్షణ చర్యలకు భంగం కలిగిస్తే జైలుశిక్ష..

కువైట్:ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎవరైనా అడ్డుకుంటే ఇకపై జైలు శిక్షతో పాటు భారీగా జరిమాన విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు 8/1969 చట్టంలోని ఆర్టికల్ 17ను సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ చర్యలు విజయవంతం అయ్యేలా, ప్రజల్లో సెల్ఫ్ ప్రివేంటీవ్ మోటివేషన్ తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న చట్టంలో సవరణలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ చట్ట సవరణల ప్రకారం ఇక నుంచి ఎవైనా ఆర్టికల్ 17 ప్రకారం ప్రభుత్వం చేపట్టే ముందస్తు జాగ్రత్త చర్యలకు ఆటంకం కలిగిస్తే వారికి మూడు నెలల జైలుతో పాటు KD5000 ఫైన్ విధిస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రకారం మహమ్మారి వైరస్ ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు విఘాతం కలిగిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు KD10,000-KD30,000 వరకు ఫైన ఉంటుందని హెచ్చరించింది. ఇక ఎవరైనా ఇన్ ఫెక్టెడ్ పేషెంట్స్ తమకు వైరస్ ఇన్ ఫెక్ట్ అయిందని తెలసి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టి..ఇతరులకు వ్యాపింపజేసేలా ప్రవర్తిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. అలాంటి వారు ఐదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, అలాగే KD10,000-KD50,000 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com