కరోనా అలర్ట్:ముందస్తు చర్యలతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నాం-షేక్ మొహమ్మద్

- March 17, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:ముందస్తు చర్యలతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నాం-షేక్ మొహమ్మద్

యూ.ఏ.ఈ:కరోనా వైరస్ ఎదుర్కొవటంలో యూఏఈ చేపడుతున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయని అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పేర్కొన్నారు. పలువురు షేక్ లు, మంత్రులతో సమావేశం అయిన యువరాజు కరోనా ప్రభావంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు విపత్కర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయని, ఏదేమైనా భవిష్యత్తులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుపటి రోజుల కన్నా ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పని చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే..కరోనా వైరస్ ను ఎదుర్కొవటంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే యూఏఈ సమర్ధవంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. మిగిలిన దేశాలతో పోలిస్తే యూఏఈ చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తాము చేపట్టిన చర్యల గురించి బయటికి చెప్పలేకపోయినా వాటి ఫలితాలు మాత్రం బాగున్నాయన్నారు. సింగపూర్,సౌత్ కొరియా, చైనా అనుభవాలు కూడా తమకు ప్రయోజనకరంగా మారాయన్నారు. వైరస్ అడ్డుకోవటంలో విజయవంతంగా కృషి చేసిన మెడికల్, పారా మెడికల్ బృందాలను ప్రశంసించారు. యూఏఈ వాతావరణ పరిస్థితులు, మత జీవన సంస్కృతి కూడా వైరస్ నుంచి కాపాడటంతో ఎంతగానో తోడ్పడిందిని షేక్ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఎమిరైతీస్ అంతా ఈ గడ్డుకాలంలో అప్రమత్తంగా ఉండాలని, తమ సంస్కృతి ప్రసాదించిన జీవన విధానంతో రోగాల బారిన పడకుండా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలిని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com