వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తోన్న సౌదీ సెంట్రల్ బ్యాంక్
- March 17, 2020
సౌదీ ప్రభుత్వం సూచనల మేరకు, సౌదీ సెంట్రల్ బ్యాంక్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని అమలు చేస్తోంది. తమ ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని ఆదేశిస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. ఫైనాన్షియల్ మరియు బ్యాంకింగ్ సిస్టమ్స్ యధాతథంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా సౌదీ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. సౌదీ పౌరులంతా తమ ఇళ్ళకే పరిమితం కావాలనీ, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో బయట తిరిగే పనులు మానుకోవాలనీ సౌదీ ప్రభుత్వం సూచించింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సిబ్బందిని తగ్గించుకోవాల్సిందిగా సౌదీ ప్రభుత్వం సూచించడం జరిగింది. కాగా, సౌదీ అరేబియాలో ఇప్పటికే 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







