మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహం
- March 18, 2020
మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహంకరోనా కట్టడిలో కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ను వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సమావేశాలు, విద్యార్ధులకు క్లాసులు చెప్పేందుకు తాత్కాలికంగా వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ అనుమతి తెలిపింది. స్కైప్ ద్వారా బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలని, అలాగే గూగుల్ మీట్, జూమ్ యాప్స్ ద్వారా కంపెనీ సమావేశాలు, విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు.
కరోనా అంటువ్యాధి కావటంతో ప్రజలను వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నాల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. అంతేకాదు ఈ గడ్డు పరిస్థితుల్లో టెలి కమ్యూనికేషన్ ద్వారా కొంత వరకు జనాలను బయటికి రాకుండా నియంత్రించే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ వినియోగాన్ని పెంచేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ కి ప్రొత్సాహకాలను కూడా ప్రకటించాలని నిన్న జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!