యూఏఈ:4 వారాల పాటు మసీదుల మూసివేత, సామూహిక ప్రార్ధనలపై నిషేధం
- March 18, 2020
యూఏఈ:కరోనా మహమ్మారి ప్రభావం ప్రార్ధనా మందిరాలపై కూడా పడింది. 4 వారాల పాటు మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని యూఏఈ స్పష్టం చేసింది. అంతేకాదు సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. గుళ్లు, చర్చీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్ సాధారణ అధికార విభాగం తెలిపింది. ఈ మేరకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ ఫత్వా కూడా జారీ చేసింది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో భాగంగా జాతీయ అత్యవసర విపత్తు నిర్వహణ(NCEMA), వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రతి రోజు మసీదుల్లో ప్రార్ధనలు జరుగుతాయని, అజన్ ను అనుసరించి భక్తులు మాత్రం ఇళ్ల వద్దే రోజు వారి ప్రార్ధనలు నిర్వహించాలని కూడా సూచించారు. నాలుగు వారాల తర్వాత వైరస్ తీవ్రతను బట్టి పరిస్థితిని సమీక్షించుకొని అంక్షలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?