స్పెషల్ ఫ్లైట్ లో ప్రభాస్
- March 18, 2020
"సాహో" సినిమా అనంతరం తన తర్వాత సినిమాను "జిల్" సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ప్రభాస్ ఇటీవల జార్జియాలో ఒక భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ సరిగా ఇవ్వడం లేదు.! అంటూ ఇప్పటికే యు.వి.క్రియేషన్స్ మీద అనేక ట్రోల్ పోస్టులు పెడుతున్నప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న డైరెక్టర్ రాధాకృష్ణ ను మాత్రం తెగ లవ్ చేస్తున్నారు.
తాజా సినిమా షెడ్యూల్ సినిమా షూటింగ్ డార్లింగ్ ప్రభాస్ లుక్ సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతున్నారు రాధా కృష్ణ కుమార్. అయితే ఇప్పుడు తాజాగా జార్జియా నుంచి బయలుదేరి హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్ లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో లో ప్రభాస్ తో పాటు యు.వి క్రియేషన్స్ మేకర్స్ ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీవేమారెడ్డి కూడా ఉన్నారు.
అందరూ సెల్ఫీ ఫోటోకు ఫోజు ఇస్తూ ఉండగా డార్లింగ్ ప్రభాస్ మాత్రం స్టైల్ గా కూర్చొని కింగ్ లా ఒక అద్భుతమైన ఫోజ్ ఇచ్చాడు. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సినిమా లవర్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ "ఎంతైనా రాజు. రాజే" అంటున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







