కరోనా ఎఫెక్ట్:మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలు రద్దు చేసిన యూఏఈ
- March 18, 2020
యూఏఈ:కరోనా వైరస్ ను అరికట్టే చర్యల్లో భాగంగా యూఏఈ మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇక కొత్త వీసాలను ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే యూఏఈ రెసిడెన్సీగా ఉన్నవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తుంది. కొత్త రెసెడెన్సీ వీసాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళా నుంచి 72 ఏళ్ల వృద్ధురాలికి యూఏఈ విజిట్ వీసా ఇచ్చింది. అయితే..ఆమె అబుదాబి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత..తన వీసా ఆటో క్యాన్సిల్ అయ్యిదంటూ తమ ట్రావెల్ ఏజెంట్ ఇన్ఫామ్ చేశాడని వృద్ధురాలి బంధువులు తెలిపారు. మార్చి 16న ఆమెకు విజిట్ వీసా వచ్చింది. అబుదాబి విమానాశ్రయ అధికారులను సంప్రదించగా..మార్చి 17కి జారీ చేసిన విజిట్ వీసాలు ఆటోమెటిక్ గా రద్దు అవుతున్నట్లు వెల్లడించారని చెబుతున్నారు. నిన్నటి నుంచే ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు మరో అధికారి కూడా తెలిపారు. అయితే..నిన్న ఉదయం 9.45 గంటల వరకు కూడా వీసా రద్దుపై ఎలాంటి ప్రకటన లేకపోవటం గమనార్హం.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..