తప్పుడు సమాచారం: 23 సోషల్‌ మీడియా అకౌంట్ల పై చట్టపరమైన చర్యలు

- March 18, 2020 , by Maagulf
తప్పుడు సమాచారం: 23 సోషల్‌ మీడియా అకౌంట్ల పై చట్టపరమైన చర్యలు

కువైట్:కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారం ప్రచారంలోకి తెస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 23 సోషల్‌ మీడియా అకౌంట్ల పై చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఈ సోషల్‌ మీడియా అకౌంట్ల వ్యవహారాన్ని అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ మొహమ్మద్‌ అల్‌ జబ్రి వెల్లడించారు. మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ , సోమవారం 14 వెబ్‌సైట్స్‌ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు. కరోనా వైరస్‌పై అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం క్షమించరాని విషయమని మినిస్టర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ని నిలువరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com