కరోనా ఎఫెక్ట్:విదేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించిన యూఏఈ

- March 19, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:విదేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించిన యూఏఈ

యూఏఈ:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా యూఏఈ మరిన్ని కఠిన నిర్ణయాలకు ఉపక్రమించింది. ఇకపై విదేశాల నుంచి యూఏఈకి వచ్చే అందరిపై నిషేధం రెండు వారాలపాటు విధించింది. అన్నిరకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 19 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న యూఏఈ రెసిడెన్సీపై కూడా ప్రభావం చూపనుంది. కరోనా వైరస్ రోజు రోజుకి మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టం చేసింది. అయితే..వీసా రెన్యూవల్స్ వారి హెల్త్ కండీషన్ ను బట్టి ఆధాపడి ఉంటుందని కూడా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. యూఏఈ వీసా కలిగిన రెసిడెన్స్ వివిధ కారణాలతో విదేశాల్లో ఉంటే ఆయా దేశాల్లోని యూఏఈ డిప్లామాటిక్ మిషన్స్ ను సంప్రదించాలని కొన్ని సూచనలు చేసింది.
- యూఏఈ వీసా ఉన్న రెసిడెన్స్ ఎవరైనా తమ సొంత దేశాల్లో ఉన్నట్లైతే అక్కడి యూఏఈ రాయబార కర్యాలయాలను సంప్రదించడం ద్వారా యూఏఈకి తిరిగివచ్చే అవకాశాలను పునరుద్దరించుకోవచ్చు.

- వ్యాపార వ్యవహారాల నిమిత్తం విదేశాల్లో ఉన్న వారు యూఏఈలోని తమ ఎంప్లాయర్స్ తో సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే వారున్న దేశంలోని యూఏఈ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి యూఏఈ తిరిగి వచ్చే అవకాశాలపై తగిన సహాయాన్ని పొందవచ్చు.

- యాత్రల నిమిత్తం విదేశీ పర్యటనలో ఉన్నవారు తాము ఉన్న ఆతిథ్య దేశంలోని యూఏఈ రాయబార కార్యాలయ అధికారులను యూఏఈ రిటర్న్ అయ్యేందుకు సపోర్ట్ తీసుకొవచ్చు.

యూఏఈ అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావానికి గురైన కుటుంబాలు  0501066099(మొబైల్),  02 3128867- 02 3128865(ల్యాండ్ లైన్),  025543883(ఫ్యాక్స్) ద్వారా ఫెడరల్ ఫర్ అథారిటీ అండ్ సిటిజన్ షిప్ అధికారులను సంప్రదించాలని ఐసీఏ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com