రియాద్:సౌదీ నుంచి భారత్ చేరుకున్న ఉమ్రా భక్తుల చివరి బృందం
- March 19, 2020
భారత్ నుంచి సౌదీ వెళ్లిన ఉమ్రా భక్తుల చివరి బృందం ఎట్టకేలకు ముంబై చేరుకుంది. బుధవారం మధ్యహ్నం కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పెషల్ ఇండిగో ఫ్లైట్ ద్వారా 185 మంది భక్తుల బృందం ముంబై చేరుకుంది. నిజానికి వీళ్లంతా మార్చి 28న ఇండియాకు తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావంతో సౌదీ అరేబియా విదేశీ భక్తులపై పలు అంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉమ్రాను పూర్తిగా రద్దు చేసింది. అలాగే పవిత్ర మదీనా మసీదులో సామూహిక ప్రార్ధనలను నిలిపివేసింది. ప్రార్ధనా మందిరాల్లోకి నిషేధం విధించింది. అంతేకాదు..మార్చి 15 నుంచి అన్ని అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. దీంతో సౌదీలోని తమ పౌరులను తీసుకువెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా దేశాల రాయబార కార్యలయాలు, ఏవియేషన్ కంపెనీలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా వెళ్లిన 3,035 మంది ఉమ్రా భక్తులను బృందాలుగా భారత్ ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం చివరి బృందం ముంబై చేరుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?