కువైట్ లో మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్
- March 19, 2020
కువైట్:ప్రపంచ దేశాలన్ని కరోనా కుదుపుతో వణికిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా..కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కువైట్ లో లేటెస్ట్ మరో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 148కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్లా అల్ సనద్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 148 కరోనా పాజిటీవ్ కేసుల్లో 18 మంది రికవరి అయ్యారు. మరో 130 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఐదుగురు ఐసీయూలో ఉండగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే 574 మంది క్వారంటైన్ గడువు ముగించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు