కువైట్ లో 160 మంది తెలుగు వారు బహిష్కరణ
- March 21, 2020
కువైట్:కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా కువైట్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను అరెస్టు చేసి వారిని వారి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ క్రమంలో కువైట్లో ఇటీవల అరెస్టయిన సుమాaరు 350 మంది భారతీయులను కువైట్ పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో భారతదేశానికి పంపించారు ఈ విమానం శనివారం ఉదయం ముంబైకి చేరుకుంది. స్వదేశానికి పంపించిన 212 మంది భారతీయుల్లో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినవారే 160 మంది ఉన్నారు. ఇందులో అత్యధికులు కడప జిల్లాకు చెందిన వారున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారత్ కు వెళ్తున్న వారిలో కడప జిల్లా చెన్నూరుకు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ పాపను తల్లి ఆస్పత్రిలోనే వదిలివేసి పారిపోగా కువైట్ పోలీసులు ఆ తల్లిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ ప్రత్యేక విమానంలో భారత్ కు వెళ్లనున్నారు. కువైట్ నుంచి విమానాల రాకపోకలు రద్దయినప్పటికీ కువైట్ అమీర్(రాజు) ప్రత్యేక అనుమతితో ఈ విమానం బయల్దేరుతోంది. ముంబైలో ఈ 212 మందిని 14 రోజుల పాటు క్వారెంటైన్లో పెడతారని భావిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?