కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఆన్ లైన్ లోనే వాహన రిజిస్ట్రేషన్ రెన్యూవల్స్..
- March 21, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం పలు ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందలో భాగంగా వాహనాల రిజిస్ట్రిషెన్స్ రెన్యూవల్స్ ని కూడా ఆన్ లైన్ కే పరిమితం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. http://rta.ae వెబ్ సైట్ ద్వారా గానీ, ఆర్టీఏ దుబాయ్ లేదా దుబాయ్ డ్రైవ్ మొబైల్ యాప్స్ ద్వారా గానీ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే..వాహనాల ఫిట్నెస్ చెక్ చేయకుండా, ఫైన్స్ చెల్లించకుండా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఎలా చేస్తారంటూ ఓ వాహనదారుడు ట్విట్టర్ అనుమానాలను వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు కరోనా కట్టడిలో భాగంగా ఆన్ లైన్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయనున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల వరకు వాహనాల ఫిట్నెస్, ఫైన్స్ చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







