మలేషియా లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన మలేషియా తెలుగు ఫౌండేషన్

- March 22, 2020 , by Maagulf
మలేషియా లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన మలేషియా తెలుగు ఫౌండేషన్

మలేషియా:ఇటీవల మలేషియా లో కరోనా వైరస్ వ్యాప్తి  ఎక్కువ అవడముతో మలేషియా ప్రభుత్వం ఈ నెల 18 నుండి 31 వరకు విమానయాన సర్వీసులను పూర్తిగా నిషేదించడమయినది అలాగే భారత ప్రభుత్వం కూడా ఇదే సమయములో  విమానయాన రాకపోకలను నిషేధించడంతో మలేషియా కూలాలంపూర్ ఎయిర్ పోర్ట్  లో దాదాపుగా 400 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు చెన్నై రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ప్రెసిడెంట్ దాతో కాంతారావు  మలేషియా ఇండియన్ హైకమిషన్ సహాయముతో వారిని ఇండియా కి వెళ్లే వరకు వారికీ కావలసిన భోజన, రవాణా వసతి సోకార్యాలను MTF ఈ నెల 31 వరకు అందించడానికి ముందుకు వచ్చింది. 

ఈ సందర్భముగా సహాయ సహకారాలు అందిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు అక్కునాయుడు కి మరియు వారి కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి ,కేల ఎక్సకో జగదీష్ రావు కి మలేషియా లోని భారత రాయబార కార్యాలయం వారికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com