కోవిడ్ -19:విదేశాల నుంచి రెసిడెంట్స్ తిరిగి వచ్చేందుకు ఆన్ లైన్ నమోదు
- March 22, 2020
యూఏఈ:విదేశాల్లో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి దేశంలోకి వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తవజుది(Tawajudi for residents) అనే వెబ్ సైట్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను యూఏఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యూఏఈకి చెందిన నివాసితులు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. అలాంటి వారు అత్యవసర పరిస్థితులు ఉంటే యూఏఈకి తిరిగి వచ్చేలా ప్రస్తుత ఆన్ లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోని తవజుది ఫర్ రెసిడెన్సీ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ అధికారులు ఆన్ లైన్ లో నమోదైన వివరాలను పరిశీలించి ఆమోదం అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..