త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత విసు క‌న్నుమూత‌

- March 22, 2020 , by Maagulf
త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత విసు క‌న్నుమూత‌

చెన్నై:ప్రముఖ నటుడు దర్శకుడు, సినీ రచయిత విసు చెన్నైలో క‌న్నుమూశారు.గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.ఆయన ఆకస్మిక మరణం సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాధన్. ఆయనను ముద్దుగా విసు పిలుచుకొనే వారు. 1945 జూలైలో జన్మించిన ఆయన వయసు 75 సంవత్సరాలు. తెలుగు సినిమా పరిశ్రమకు దాదాపు 30 ఏళ్లకుపైగా సేవలందించారు. వెండితెర, టెలివిజన్‌పై కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు.

సంసారం ఒక చదరంగం, చిదంబర రహస్యం, ఆడదే ఆధారం లాంటి చిత్రాలను రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం చేపట్టారు. పలు సినిమాలకు మాటలు రాశారు. ఆయన సినిమాల్లో సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు ఎక్కువగా కనిపించేవి.

సినిమాల నుంచి దూరమైన తర్వాత 2016లో ఆయన బీజేపీలో చేరారు. జాతీయభావం, ఆధ్యాత్మికభావం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. కానీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. వయసుపై బడటంతో పార్టీకి పెద్దగా సేవలు అందించలేకపోయారని సన్నిహితులు చెప్పుకొంటారు.

ఆయన మరణ వార్తను తెలుసుకొన్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com