అమెరికా: సీరియల్ రేపిస్టుకి కరోనా..

- March 23, 2020 , by Maagulf
అమెరికా: సీరియల్ రేపిస్టుకి కరోనా..

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ కి కరోనా సోకింది. పలువురు సినీ తారలు, మాజీ మోడల్స్ పై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతనికి భయంకర కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు న్యూయార్క్ లోని స్థానిక వార్తా పత్రిక 'నయాగరా గెజిట్' తెలిపింది. ఇతనికి కోర్టు 23 ఏళ్ళ జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే హార్వెకి కరోనా సోకిందా అన్న విషయమై వ్యాఖ్యానించేందుకు ఇతని సన్నిహితులు నిరాకరించారు. హార్వేని న్యూయార్క్ కి 350 మైళ్ళ దూరంలోని బఫెలో దగ్గరి జైలుకు తరలించారు. అంతకు ముందు రైకర్స్ ఐలాండ్ జైల్లో ఉంచారు. ఛాతీ నొప్పికి గురైన ఇతడికి మన్ హటన్ లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. . ఖైదీలతో కిక్కిరిసి ఉన్న న్యూయార్క్ జైళ్లలో వారికి కరోనా పాజిటివ్ సులభంగా సోకే అవకాశం ఉంది.తాజాగా అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 417 కి పెరిగింది. 33 వేల కేసులు నమోదయ్యాయి. హార్వే కి గత ఫిబ్రవరిలో కోర్టు జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com