కోవిడ్ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్ మొహమ్మద్
- March 23, 2020
స్కూళ్ళు మూతపడ్డాయి.. యూనివర్సిటీలు మూతపడ్డాయి.. కానీ, చదువు మాత్రం ఆగదని యూఏఈ ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' చెప్పారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేశారు. ఓ స్కూల్లో ఇ-లెర్నింగ్ సెషన్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. తొలి వర్చువల్ స్కూల్ డే సందర్భంగా ఓ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాననీ, ఒక మిలియన్‌కి పైగా విద్యార్థులు వర్చువల్ స్కూల్‌తో కనెక్ట్ అయ్యారనీ చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఒక మిలియన్ మందికి పైగా విద్యార్థులు ఇ-లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తున్నారనీ, కరోనా ఎఫెక్ట్‌కి ఈ రకంగా చెక్ చెప్పామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు