కోవిడ్‌ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్‌ మొహమ్మద్‌

- March 23, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్‌ మొహమ్మద్‌

స్కూళ్ళు మూతపడ్డాయి.. యూనివర్సిటీలు మూతపడ్డాయి.. కానీ, చదువు మాత్రం ఆగదని యూఏఈ ప్రధాని, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ 'షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం' చెప్పారు. ఈ మేరకు షేక్‌ మొహమ్మద్‌ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్‌ చేశారు. ఓ స్కూల్‌లో ఇ-లెర్నింగ్‌ సెషన్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. తొలి వర్చువల్‌ స్కూల్‌ డే సందర్భంగా ఓ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాననీ, ఒక మిలియన్‌కి పైగా విద్యార్థులు వర్చువల్‌ స్కూల్‌తో కనెక్ట్‌ అయ్యారనీ చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఒక మిలియన్‌ మందికి పైగా విద్యార్థులు ఇ-లెర్నింగ్‌ ద్వారా విద్యనభ్యసిస్తున్నారనీ, కరోనా ఎఫెక్ట్‌కి ఈ రకంగా చెక్‌ చెప్పామని ఆయన వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com