అమ్మో!..చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి
- March 24, 2020
చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ తోనే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4లక్షల మంది ఈ వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. మిగిలిన ప్రజలు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనితోనే చస్తుంటో.. మరో వైరస్ మొదలైంది. అది కూడా చైనాలోనే మొదలు కావడం గమనార్హం.
తాజాగా చైనాలో హంటా వైరస్ వెలుగు చూసింది. ఇది ఎలుకల్లో పుట్టుకొచ్చే వైరస్. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. సుమారు 33 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు చేరుకుంది. ఈ బస్సులో యునాన్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను మరణించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







