యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి

- March 25, 2020 , by Maagulf
యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి

యూఏఈ:ప్రజల అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, సహాకార సంఘాలు 24 రోజంతా తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే మెడికల్ షాపులు 24 గంటలూ ఓపెన్ చేసి ఉండొచ్చని కూడా యూఏఈ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ విపత్తుల నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ కేంద్రమైన చైనా విపత్తు నుంచి తేరుకుంటోంది. ఇప్పటికే  వుహాన్ లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. బీజింగ్ జూ, చైనా వాల్ సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే..చైనా కోలుకుంటుంటే యూరప్ దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com