రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు

- March 25, 2020 , by Maagulf
రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు

సౌదీ అరేబియాలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ఫ్యూ కారణంగా ఎవరు బయటికి రావొద్దని కూడా  హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే..నిత్యావసరాలు, కిరాణా సామను కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆన్ లైన్ సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. దేశ పౌరులు, నివాసితులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర కిరణా సామాగ్రిని బలగ్ తిజరీ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే 1900కి డయల్ చేసి కూడా కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోచ్చు. అయితే..వినియోగదారులకు షాపుల నుంచి సరైన వస్తువుల, సరైన పద్దతిలో సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, చేపలు, బేకరి ఐటమ్స్ వరకు ఆన్ లైన్ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com