బహ్రెయిన్: ఆన్ లైన్ లో వైద్య సేవలు..కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం
- March 25, 2020కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాయల్ బహ్రెయిన్ హస్పిటల్ ఆన్ లైన్ లోనూ వైద్య సేవలు అందిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించటంలో భాగంగా ఆర్బీహెచ్ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్లాట్స్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. www.royalbahrainhospital.com/telehealth ద్వారా స్లాట్స్ కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ముందుగా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఏ విభాగం డాక్టర్ ను ఏ సమయంలో సంప్రదించాలని అనుకుంటున్నారో నమోదు చేయాలి. ఆ తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఈ-మెయిల్ కు టైం స్లాట్ నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. దాంతో పాటు ఓ లింక్ కూడా వస్తుంది. స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తి 15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. టెలి హెల్త్ ద్వారా హెల్త్ చెకప్ చేసిన సదరు డాక్టర్ మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ కు ప్రిస్కిప్షన్ పంపిస్తారు. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లైట్స్, డెస్క్ టాప్ నుంచి టెలి హెల్త్ సేవలను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం