యూఏఈ:వారంతంలో రవాణా వ్యవస్థ బంద్

- March 26, 2020 , by Maagulf
యూఏఈ:వారంతంలో రవాణా వ్యవస్థ బంద్

యూఏఈ:కరోనా వైరస్ కట్టడికి యూఏఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ వారంతంలో దేశవ్యాప్తంగా స్టెరిలైజేషన్ (కెమికల్స్ తో శుద్ధి చేయటం) చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 26న రాత్రి 8 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు దుబాయ్ మెట్రోతో సహా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేయనున్నట్లు యూఏఈ ప్రకటించింది. జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంస్థలు, ప్రజా రవాణా సంస్థకు చెందిన వాహనాలు, మెట్రో సర్వీసులను అన్నింటిని స్టెరిలైజ్ చేయనున్నారు. ఈ నాలుగు రోజులు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ను నియంత్రించటంతో పాటు అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ నాలుగు రోజులు ప్రజలు ఎవరు బయటికి రావొద్దని కూడా ఆరోగ్య, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అయితే..ఆహారం, మెడిసిన్ కావాల్సిన వారికి మాత్రం బయటికి వచ్చేందుకు మినహాయించారు. అలాగే మిలటరీ, పోలీసులు, ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులు, విద్యుత్, పోస్టల్, పోస్టల్, గ్యాస్ స్టేషన్ తరహా ఎమర్జెన్సీ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఎమర్జెన్సీ విభాగాల ఉద్యోగుల సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయిని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com