ఖతార్: స్వీయ నిర్బంధం పాటించని 10 మంది అరెస్ట్
- March 26, 2020
స్వీయ నిర్భంధం నిబంధనలు ఉల్లఘించిన 10 మందిని సంబంధిత అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అరెస్టైన వాళ్లందర్ని ఖచ్చితంగా నిర్బంధంలో ఉండాల్సిందేనని గతంలోనే ఖతార్ అధికారులు సూచించారు. అయితే..అధికారుల సూచనలను పట్టించుకోకుండా నిర్బంధం నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్లందర్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టైన పది మందిపై విచారణ చేపట్టి తగిన విధంగా శిక్షిస్తామని ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే మార్చి 20 నుంచి 25 మధ్య విదేశాల నుంచి ఖతార్ చేరుకున్న వాళ్లందరు స్వీయ నిర్బంధం పాటించాల్సిందేనని ఆరోగ్య శాఖ తమ అధికార ట్విట్టర్ ద్వారా కోరింది. లేదంటే ప్రజల ఆరోగ్య భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు