కువైట్ సిటీ: నిర్బంధంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కువైతీస్..రిసార్ట్స్ శిబిరాల ఏర్పాటు

కువైట్ సిటీ: నిర్బంధంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కువైతీస్..రిసార్ట్స్ శిబిరాల ఏర్పాటు

విదేశాల నుంచి తిరిగి వచ్చిన 306 మంది కువైతీస్ ను 14 రోజుల నిర్బంధంలో పెట్టారు. వాళ్లందర్ని నిర్బంధంలో పెట్టేందుకు అల్ జోన్, సీషెల్ వంటి రిసార్ట్స్ లో ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన కువైతీస్ ను విడతలు విడతలు గా ప్రత్యేక ఫ్లైట్లలో కువైతీ ప్రభుత్వం సొంత దేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్, ఈజిప్ట్, బహ్రెయిన్ నుంచి ఇప్పటివరకు 306 మందిని బుధవారం కువైట్ కు తీసుకొచ్చారు. తొలి విడత తరలింపులో భాగంగా వచ్చే ఆదివారం వరకు విదేశాల్లోని కువైతీస్ ను తీసుకురానున్నారు. ఇవాళ (మార్చి 27)న సాయంత్రం 5 గంటలకు జర్మనీ నుంచి మరికొందరు కువైట్ చేరుకున్నారు. లండన్ నుంచి రాత్రి 8 గంటలకు మరికొందరు కువైట్ చేరుకుంటారు.  ఇలా సొంత దేశానికి చేరుకుంటున్న కువైతీస్ అందరికీ ఎయిర్ పోర్టుల్లో పకడ్బందీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైరస్ సోకకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఖచ్చితంగా నిర్బంధంలో పాటించేలా చర్యలు తీసుకుంటోంది. వాళ్లందరికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయితేనే నిర్బంధం నుంచి విడిచిపెట్టనున్నారు. ఇదిలాఉంటే గల్ఫ్ లో నివాసం ఉంటున్న 611 మంది విదేశీయులను ప్రత్యేక విమానాల్లో తమ సొంత దేశాలకు తరలిస్తున్నారు. 342 ఈజిప్టియన్లు, 254 ఫిలిపియన్లు, 15 మంది బహ్రెయినియన్లను తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వారి వారి దేశాలకు తరలించారు.

 

Back to Top