ఖతార్: స్వీయ నిర్బంధం పాటించని 10 మంది అరెస్ట్
- March 26, 2020స్వీయ నిర్భంధం నిబంధనలు ఉల్లఘించిన 10 మందిని సంబంధిత అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అరెస్టైన వాళ్లందర్ని ఖచ్చితంగా నిర్బంధంలో ఉండాల్సిందేనని గతంలోనే ఖతార్ అధికారులు సూచించారు. అయితే..అధికారుల సూచనలను పట్టించుకోకుండా నిర్బంధం నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్లందర్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టైన పది మందిపై విచారణ చేపట్టి తగిన విధంగా శిక్షిస్తామని ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే మార్చి 20 నుంచి 25 మధ్య విదేశాల నుంచి ఖతార్ చేరుకున్న వాళ్లందరు స్వీయ నిర్బంధం పాటించాల్సిందేనని ఆరోగ్య శాఖ తమ అధికార ట్విట్టర్ ద్వారా కోరింది. లేదంటే ప్రజల ఆరోగ్య భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు