నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఉపరాష్ట్రపతి
- March 27, 2020
ఢిల్లీ:ప్రధాన మంత్రి సహాయ నిధికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి ప్రకటించారు. వీటితో పాటు కేంద్రం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం టీం ఇండియా స్ఫూర్తిగా ముందుకెళ్తోందని కితాబునిచ్చారు. ఈ దిశలోనే ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు తన వంతుగా చిన్న సహకారాన్ని అందిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ఆ లేఖలో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







